కందుకూరు, కడదొడ్డి గ్రామాలలో దేవుని ఇనాం వందల ఎకరాల్లో కబ్జా చేసిన వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కందుకూరులో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేయించిన రిసర్వే ఒక బూటకం అది జగన్నాటకం అని చమత్కరించారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.