మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఎవరికి..?

1541చూసినవారు
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఎవరికి..?
మంత్రాలయం నియోజకవర్గం ఒకప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మంత్రాలయం ప్రత్యేక నియోజకవర్గంలో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒక సారి టీడీపీ, మూడు సార్లు వైసీపీ విజయం సాధించాయి. కాగా 2012లో ఉప ఎన్నిక జరగగా వైసీపీ అభ్యర్థిగా బాలనాగిరెడ్డి విజయం సాధించారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఈ సారి జరిగే ఎన్నికల్లో వైసీసీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిటీ టీడీపీ తరుపున మాధవరం రాఘవేంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉండటంతో టీడీపీ బీసీలకు అవకాశం కల్పించింది. దీంతో ఈ సారి పోటీ రసవత్తరంగా మారింది.

సంబంధిత పోస్ట్