కోసిగి మండలంలో 1500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు టిడిపి ప్రభుత్వం కృషి చేస్తోంది. రూ.6.6 కోట్ల నిధులతో పైపు లైన్ పనులను మంత్రాలయం టిడిపి ఇన్ ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి పరిశీలించారు. రైతుల కోసం పీవీసీ, కాంక్రీట్ పైపు లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఏఈ ప్రేమ్ కుమార్ ఉన్నారు.