మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై ఊరేగారు. శనివారం ధనుర్మాసం ద్వాదశి శుభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బృందావనానికి క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం చేసి వెండి, బంగారు, పట్టు వస్ర్తాలతో శోభాయమానంగా అలంకరించారు. మూలరాములకు , జయరాములు, దిగ్విజయరాములకు కనకాభిషేకం చేశారు.