హైదరాబాద్లో రిపోర్టర్పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని ఏపీయుడబ్ల్యూజే మండల అధ్యక్షుడు బొగ్గుల సోమన్న డిమాండ్ చేశారు. గురువారం పెద్దకడబూరులోని మండల తహశీల్దార్ ఆఫీసు ఎదుట ఏపీయుడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొనిరావాలని కోరుతూ వీఆర్వో కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు.