పెద్దకడబూరు పాఠశాల ఆవరణంలో జరుగుతున్న అక్రమ కట్టడాన్ని నిలిపి, క్రీడా మైదానాల ధ్వంసాన్ని ఆపాలని డిఓఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పాఠశాల ఆవరణంలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. డిఓఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంటే. స్థానిక నాయకులు క్రీడాస్థలాలను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు.