జనసేన ఇన్ చార్జ్ లక్ష్మన్నకు ప్రత్యేక అభినందనలు

52చూసినవారు
జనసేన ఇన్ చార్జ్ లక్ష్మన్నకు ప్రత్యేక అభినందనలు
కోసిగి మండలం నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ చార్జ్ వాల్మీకి లక్ష్మన్న ఇంటికి మంగళవారం తరలి వచ్చారు. లక్ష్మన్నకు జనసేనికులు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోసిగి మండలం నాయకులు వీరారెడ్డి, నాగేష్, కోసిగయ్య, మంజునాథ్, కరీం స్వామి, రాజు, ముత్తన్న, రాము, రామాంజిని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్