విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల ఐదో తేదీన విద్యాసంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బందును విజయవంతం చేయాలని కోస్గి లో స్థానిక సిపిఐ కార్యాలయంలో ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ.. కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వంకి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రోజురోజుకి వివక్ష ఎక్కువ అవుతుంది. ఏపీలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ప్రైవేటీకరణ చేయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకుంది. విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ గాని చేస్తే ఊరుకునేది లేదు. విశాఖలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరిని ప్రభుత్వం అధీనంలోకి తీసుకునేంతవరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అంజి వీరేష్, బాలు, పాల్గొనడం జరిగింది.