జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ ఫారం 1634 ఎకరాల ప్రభుత్వ భూములను వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగించి మెగా సీడ్ పార్క్ హబ్ గా తయారు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు కోరారు. బుధవారం తంగడంచ భూములు పరిశీలనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కృప దాసుకు వినతి పత్రం సమర్పించారు.