జూపాడుబంగ్లా: పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
జూపాడుబంగ్లా: పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జూపాడుబంగ్లా మండలంలో ఎమ్మెల్యే జయసూర్య శనివారం అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్