పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త మద్దిలేటి రెడ్డి (55) ఆదివారం గుండెపోటుతో మరణించారు. వైసిపి రాష్ట్ర యువజన నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి డాక్టర్ ధార సుధీర్ ఆదేశాల మేరకు మాజీ జెడ్పిటిసి సభ్యులు నాగిరెడ్డి ఆదివారం.. పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.