కొత్తపల్లి మండలంలోని గోకవరం ప్రాథమి ఆరోగ్య కేంద్రానికి భారతీయ స్టేట్ బ్యాంకు వారి సహాకారంతో హైదరాబాద్ అవేర్ గ్రూప్స్ తమ వంతు సహకారంగా వైద్యశాలకు అత్యాధునిక వైద్యపరికరాలు సోమవారం అందజేశారు. వైద్యశాలకు అవసరమైన హైడ్రాలిక్ బెడ్ కాట్, స్ట్రక్చర్, ఆపరేషన్ టేబుల్, వాటర్ ప్యూరిఫైయర్ వంటి తదితర వైద్య పరికరాలను అవేర్ గ్రూప్స్ చైర్మన్ మాధవన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ వరుణ్ వైద్యులు విజయేంద్ర, జూబేధాలకు అందించారు.