ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా మండల కేంద్రమైన పగిడ్యాలలో.. టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్, ఏర్పాటు చేయడం ఇది మంచి ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, మండల కన్వీనర్ పలిచాని మహేశ్వర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.