ఆత్మకూరు: నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

64చూసినవారు
ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెరువు గ్రామ సమీపంలో గల నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న నాటుసారా స్థావరాలపై శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 1300 లీటర్ల బెల్లపు ఊటను నేలపాలు చేశారు. అలాగే 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్ తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్