శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా శనివారం డి. ఎల్. కామేశ్వరి, హైదరాబాద్ వారిచే దేవీభాగవతం పై ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద శనివారం సాయంకాలం నుండి ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.