నంద్యాల జిల్లాలో అన్ని గ్రామాలలో స్మశాన వాటికలకు స్థల సమస్య ఉందని రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్థలాలను అన్వేషించి నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆర్డీఓలు, తాసిల్దారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో భాగంగా జిల్లా అధికారులు, మండల స్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.