నంద్యాల జిల్లా చిన్నదేవులపురం గ్రామానికి చెందిన పీ. హేమంత్ ఆయన స్నేహితులు తలసేమియా చిన్నారుల కోసం స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 40 మంది యువతీ యువకులు రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని నంద్యాల బ్లడ్ సెంటర్ సభ్యుడు అంకన్న తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.