వర్షం పడుతున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు పడుతున్నప్పుడు విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల పక్కన నిలబడవద్దు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్ రాడ్స్‌ను వాడకూడదు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్ ప్రమాదాలతో సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు.