నంద్యాల: షాపుల వేలం జయప్రదం

84చూసినవారు
నంద్యాల: షాపుల వేలం జయప్రదం
నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం ఆవరణలోని 1వ షాపు బహిరంగ కౌలు వేలం ప్రకటనలో శివశంకర్ అనే వ్యక్తి సోమవారం షాపును దక్కించుకున్నారు. ఆలయ కార్యనిర్వణాధికారి వేణునాధ రెడ్డి మాట్లాడుతూ.. 3 సంవత్సరాలకు, ప్రతినెల 6,000 రూ. అద్దెతో షాపును వారికి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వేలం పాటను దేవాదాయ శాఖ అధికారి హరిచంద్ర రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్