కడప జిల్లా బద్వేలు శివారులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న దస్తగిరమ్మ అనే దూదేకుల యువతి గ్యాంగ్ రేప్ కు గురై పెట్రోల్ తో నిప్పంటించిన సంఘటనను నంద్యాల దూదేకుల సంఘం నాయకులు శనివారం తీవ్రంగా ఖండించారు. నంద్యాల పట్టణంలోని నూరు నర్సింగ్ హోమ్ లో దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్ మాట్లాడుతూ బద్వేల్ శివారులో దూదేకుల యువతిపై ఐదుగురు ఐదుగురు దుండగులను వెంటనే అరెస్టు చేయాలన్నరు.