నాణ్యత లేని పనులు చేయడం వల్లనే బండరాతి పరుపు కృంగిపోయింది

76చూసినవారు
పాణ్యం మండలంలోని గోరుకల్లు రిజర్వాయర్ ను మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శనివారం సందర్శించారు. వారు మాట్లాడుతూ రిజర్వాయర్లో నాణ్యత లేని పనులు చేయడం వల్లనే బండరాతి పరుపు కృంగిపోయిందని తెలిపారు. గతంలోనే రాతి పరుపు కృంగిపోయే పరిస్థితుల్లో ఉందని ఇంజనీర్లు నివేదిక సమర్పించారని అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్