నంద్యాలలోని స్థానిక టెక్క టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కిరాణా షాప్ లో ఆదివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. దాదాపు 25 వేల నగదు, 30 వేల సరుకు పోయిందని తన షాపులో దొంగతనం జరగడం ఇది రెండవ సారి అని బాధితుడు తెలియజేశాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. కోడి కూత వేసే దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ దొంగతనం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.