నంద్యాల పట్టణం, భరత మాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు ఏప్రిల్ 30 తేదీ నుంచి మే 7 తేది వరకు 8 రోజుల పాటు 10-15 సంవత్సరాల వయసు గల విద్యార్థినీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై రెసిడెన్షియల్ యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సోమవారం యోగ చైతన్య కేంద్రం సెక్రటరీ దామోదర కుమార్ రెడ్డి తెలిపారు. ఈ క్యాంపు ద్వారా పిల్లలకు ఏకాగ్రత, క్రమశిక్షణ, వ్యక్తిత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు.