పార్థివ దేహానికి నివాళులు ఎమ్మెల్యే
నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పగిడాలలోని ఆంజనేయ నగర్ కు చెందిన అడ్డాకుల రంగమ్మ (55) ఆదివారం మృతి చెందారు. విషయము తెలుసుకున్న నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య గ్రామానికి చేరుకుని రంగమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.