అన్నదాతకు అండగా కూటమి సర్కార్ పై నిరసన గళం వినిపించేందుకు శుక్రవారం నంద్యాల కలెక్టరేట్ వద్దకు జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున చేరుకున్న పార్టీ శ్రేణులు, రైతులు వచ్చి నిరసన తెలిపారు. రైతులకు జరుగుతున్న అన్యాయంకు నిరసన వ్యక్తం చేస్తున్నామని జిల్లా వైసీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఉచిత బీమా ఊసే లేదని, 6 నెలలు గడుస్తున్న రైతుల సంక్షేమం గాలికి వదిలేసిందన్నారు.