ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన ఎల్కెతండా నాయకులు

59చూసినవారు
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన ఎల్కెతండా నాయకులు
పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గౌరు చరితా వెంకటరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని ఎల్. కె. తండా నాయకుడు, నియోజకవర్గ ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ బాబునాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గౌరు చరితా వెంకటరెడ్డికి పూలమాలలు, శ్శాలువాలు వేసి అభినందనలు తెలియజేశారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు

సంబంధిత పోస్ట్