పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహణ

63చూసినవారు
పత్తికొండలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఉదయం 11 గంటలకు గ్రామసభ నిర్వహించారు. పరిశుభ్రత కార్యక్రమాల గురించి, సీజనల్ వ్యాధుల గురించి ప్రతి మూడు నెలలకు ఒక మారు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. గ్రామపంచాయతీ గౌరవ అధ్యక్షురాలు ఎస్. నాగరత్నమ్మ, సర్పంచ్ కొమ్ము దీపిక, ఎగ్జిక్యూటివ్ అధికారి నరసింహులు, పంచాయతీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్