పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం స్వచ్చాంధ్ర - స్వచ్చ వికాస్ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణంలోని సంతమార్కెట్ ప్రాంగణంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యపడుతోందని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా పట్టణ పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.