మహానంది ఆలయానికి పోటెత్తిన భక్తులు

61చూసినవారు
కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మహానంది ఆలయానికి భక్తులు పోటెత్తారు. రుద్రగుండం కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ పరిసరాల్లో పలుచోట్ల కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మహానందీశ్వర స్వామి, అమ్మ వార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి భక్తుల పోటేత్తారు.

సంబంధిత పోస్ట్