పింఛన్ల కోసం వృద్ధుల అవస్థలు

85చూసినవారు
పింఛన్ల కోసం వృద్ధుల అవస్థలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండటంతో జూన్ నెల పెన్షన్ల ప్రక్రియలో వృద్ధులకు ఇబ్బందులు తప్పలేదు. జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేయడంతో నగదు డ్రా చేసుకునేందుకు వృద్ధులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్యాంకుల వద్ద సంబంధిత డిపాజిట్లను ఏ విధంగా డ్రా చేసుకోవాలో అర్థం కాక వృద్ధులు తికమక పడ్డారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్