శ్రీశైలం మహాక్షేత్రంలో ప్రతి సోమవారం మల్లికార్జున స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ విశేషంగా నిర్వహిస్తారు. ఈరోజు ఆలయ ప్రాంగణంలోని సహస్రదీపాలంకరణ మండపంలో దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి రథంలో ఉంచి వేదమంత్రోచ్ఛారణలతో, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించారు.