శ్రీ‌శైలం క్షేత్రానికి పోటెత్తిన జనం

60చూసినవారు
కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీ‌శైలం క్షేత్రానికి జనం పోటెత్తారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీ నెలకొంది. తెల్ల‌వారుజాము నుంచే ఆదిదంప‌తుల ద‌ర్శ‌నానికి క్యూలైన్ల‌లో భక్తులు భారీగా వేచి ఉన్నారు. ఉచిత ద‌ర్శ‌నానికి 4 గంట‌లు, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి 2 గంట‌ల స‌మ‌యం పడుతోంది. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు అల్పాహారం, పాలు, మంచినీరు అంద‌జేస్తున్నట్లు ఆల‌య సిబ్బంది తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్