మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ పంట పొలాల్లో రీ సర్వేను తహసిల్దార్ పి. రమాదేవి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రీ సర్వేలో భాగంగా రైతుల సమక్షంలోనే కొలతలు వేసి భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులు సహకరించాలని ఏవైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన ధ్రువపత్రాలు చూపించి సమస్య పరిష్కరించుకోవడానికి ఇది మంచి సువర్ణ అవకాశం అన్నారు.