రిటైర్డ్ ఎంఈఓ జానకిరామ్ సేవలు మరువలేనివి

75చూసినవారు
రిటైర్డ్ ఎంఈఓ జానకిరామ్ సేవలు మరువలేనివి
ఆత్మకూరు రిటైర్డ్ ఎంఈఓ జానకి రామ్ విద్యారంగంలో చేసిన సేవలు మరువలేనివని ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు శంకర్, ఉమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయనకు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 34 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విద్యారంగంలో జానకిరామ్ సేవలందించడం గొప్ప విషయం అని అన్నారు. ప్రత్యేకించి 24 ఏళ్లపాటు గణిత ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు.

సంబంధిత పోస్ట్