మల్లన్నకు వెండి రథోత్సవం

53చూసినవారు
మల్లన్నకు వెండి రథోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల వెండి రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఈవో పెద్దిరాజు, ఆర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను వెండి రథంపై అధిష్టింపజేసి ఆలయ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్