ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి

67చూసినవారు
ఆత్మకూరు మండలంలోని కొట్టాలచెరువు గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి ఇబ్బందులకు గురిచేస్తున్న మహిళ నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు సోమవారం ఆత్మకూరు తాహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మహిళ నుంచి భూమిని స్వాధీనం చేసుకొని తమ గ్రామానికి మంజూరైన గురుకుల పాఠశాలను నిర్మించాలని కోరారు. అనంతరం తహసిల్దార్ రత్నరాధికకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్