ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం పూలచింతలో గురువారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరగనుందని, జయప్రదం చేయాలని బుధవారం జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు జై భీమ్ ఎమ్మార్పీఎస్ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.