ఎమ్మిగనూరు పట్టణంలోని యం. బి చర్చి దగ్గర ఎస్సీ కాలనీలో నివాసముంటున్న మణిక్యమ్మ అలియాస్ బుల్లెమ్మ అనే మహిళ శనివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందింది. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ యువ నాయకులు వై. ధరణి దర్ రెడ్డి మృతదేహానికి నివాళిలర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం చేశారు.