ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గాజులదిన్నె ప్రాజెక్టు ఆయకట్టు భూములకు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి మంగళవారం జీడీపీ అధికారులతో కలిసి సాగునీటిని విడుదల చేశారు. జీడీపీ కుడి కాలువ నుంచి 25 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 30 క్యూసెక్కుల నీటిని తూము ద్వారా వదిలారు. అనంతరం ఎమ్మెల్యే వేముగోడు గ్రామంలో పర్యటించి, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జీడీపీ డీఈ విజయ్ కుమార్, తహసీల్దార్ కుమారస్వామి ఉన్నారు.