కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గోనెగండ్ల మండలం వేముగోడు వద్ద బైక్ అదుపుతప్పి యూసుఫ్ (52) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన యూసుఫ్ ఎమ్మిగనూరుకు తన బైక్ పై వస్తుండగా వేముగోడు గ్రామ సమీపంలో అదుపు తప్పి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.