ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 4న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన బుధవారం విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్, బీటెక్, డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.