టీడీపీ కోటి సభ్యత్వం ఘనత లోకేష్‌దే: మంత్రి అనగాని

51చూసినవారు
టీడీపీ కోటి సభ్యత్వం ఘనత లోకేష్‌దే: మంత్రి అనగాని
AP: టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపల్లే కార్యాలయంలో పార్టీ జెండాను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని తెలుగువారి ఆత్మగౌరవం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం స్థాపించారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో TDP తెలుగు ప్రజలకు మరింత సేవ చేసిందని తెలిపారు. టీడీపీ కోటి మంది సభ్యత్వం ఘనత మంత్రి లోకేష్‌దే అని అనగాని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్