ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్నమయన్మార్, థాయ్‌లాండ్ దేశాలకు సాయం చేసేందుకు మరోసారి భారత్ ముందుకొచ్చింది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపనుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్‌లో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. వెయ్యి మందికి పైగా చనిపోగా, మరో 2 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది.