AP: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, TDP నేత వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. ఈ వీడియో పవన్ ను టార్గెట్ చేసే వర్మ షేర్ చేశారన్న చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా టీడీపీ, జనసేన నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న తరుణంలో ఈ వీడియో రచ్చరేపుతోంది.