NTTPS కోల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

72చూసినవారు
NTTPS కోల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
AP: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కొండపల్లి సమీపంలోని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS) కోల్ ప్లాంట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో కోల్‌ప్లాంట్‌ టీపీ-94ఏ2 బెల్టు దగ్గర మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సిబ్బంది మంటలార్పేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్