AP: ఉమ్మడి కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సై వెంకట నరసింహులపై సస్పెన్షన్ వేటు పడింది. చిత్తూరు జిల్లా సోమల PSలో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్నందుకు ఆయనను సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్ చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.