AP: ఈ నెలలోనే మెగా డీఎస్సీ ఇస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. నిన్న ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న విధానాలను వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనిచ్చారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు.