ముఖ్య నేతలతో ఎమ్మెల్యే వసంత భేటీ

76చూసినవారు
ముఖ్య నేతలతో ఎమ్మెల్యే వసంత భేటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మైలవరంలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. మైలవరం ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే వసంతను కాకుండా తిరుపతిరావును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణా ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే వసంత తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరైయ్యారు.

సంబంధిత పోస్ట్