ఎమ్మెల్యే కోటాలో మండలికి నాగబాబు!

76చూసినవారు
ఎమ్మెల్యే కోటాలో మండలికి నాగబాబు!
AP: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి జనసేన తరఫున నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం. నిన్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో భేటీ అయినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చంద్రబాబు కూడా నాగబాబును మంత్రి మండలిలో తీసుకుంటామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్