ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు కలెక్టర్లు ఈ వడపోత ప్రక్రియ చేపడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు అనర్హులుగా భావించిన వారికి జనవరిలో పెన్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలో మరింత ఎక్కువ మందికి పెన్షన్ కట్ కానుంది.